Wednesday, 13 February 2013

వయస్సు మళ్ళిన దేవుళ్ళు

నవ విధ భక్తీ అంటారు కదా , భక్తీలో బోల్లేడు విధానాలు. ఒక్కొక్కరిది ఒకో టైపు లో ఉంటుంది. నాకు ఊహ తెలిసినప్పటినుంచి మా అమ్మ నాకు నేర్పిన భక్తి విధానం "దేముడా! నువ్వే దిక్కు" అనుకుంటూ మనస్పూర్తిగా చేతులు జోడించి వేడుకోవటం. దేవుడు అన్నిటి లో / అందరి లో ఉన్నాడు అని నమ్మి, ఇటు దేవుడిని అటు ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఓ దీపం వెలిగించి , ఓ మంచి పాట తెలుగు...లో పాడి అన్ని నువ్వు చూసుకో వయ్య అని ముగించేయటం. ఈ భక్తీ విధానం అలవాటై , దేవుడు నేను ఇన్నాళ్ళు స్నేహితుల్లాగా కలసి వున్నాము. వాడు ఉన్నాడని నాకు తెలుసు. బయట వాడిని వెదకటం కంటే నాలో ఉన్న పరమాత్మని అనునిత్యం ధ్యానించుకుంటూ మా అమ్మ చూపించిన దేవుడిని మనసులోనే సాక్షాత్కరించుకుంటూ వచ్చాను . ఇల్లా పాతికేళ్ళు గడిచాయి
ఈ మధ్య మా అమ్మ దేవుడికి వయస్సు మీద పడినట్లు ఉంది ఇదివరకు మా అమ్మ పెట్టె పువ్వులతో సంతృప్తి పడేవాడు ఇప్పుడు మెల్లి మెల్లిగా మా అమ్మ ప్రసాదాలకు అలవాటు పడ్డాడు. అర్థమయ్యే పాటలతో ప్రసన్నమయ్యే వాడు ఇప్పుడు మా అమ్మ అష్తోత్రాలు సహస్రానామాలతో కానీ ఊరుకూవటం లేదు. బ్రహ్మ మురారి తో సంతుష్టుడయ్యే భోళా శంకరుడు ఇప్పుడు తన కుటుంబ సభ్యులందరినీ పూజించమని డిమాండు చేస్తునాడు . రామ నామమే జీవనము అంటూ పాడించుకునే రాముడు నేను తక్కువా అంటూ లక్ష్మి దేవికి హనుమంతుడుకి , సూర్యుడికి అష్తోత్రాలు చేబితీ కాని శాంతించడం లేదు. మా అమ్మ కూర్పుగా కట్టే కనకంబరాలతో శోభిల్లే శ్రీనివాసుడు ఇప్పుడు సుప్రభాతానికి కాని నిద్ర లేవటం లేదు . క్రొత్త దేవుళ్ళు బాబాలు దేవుడి గూటికి చేరి గూడు కట్టుకున్నారు. మునుపు స్నానాంతరం కొనసాగీ పూజ ఇప్పుడు నిర్దిష్టమైన సమయానికి వచ్చేసింది . తెల్లవారకముందే లేపి స్నానాలు ముగింపచేసి మిగితా వారి నిద్ర తో నిమిత్తం లేకుండా లైట్లు వేయించుకుని మరీ క్షుణ్ణంగా పూజ జరిపించుకున్తున్నాడు మా అమ్మ చేత దేవుడు . నిరాహార దీక్షలు కూరుకున్తున్నాడు. అమాయకమైన భక్తికి లొంగేవాడు ఇప్పుడు మోటుగా పూజ చేయ్యిన్చుకున్తున్నాడు. మా అమ్మ చిన్నప్పుడు చూపించిన దేవుడితో ఇన్ని సమస్యలు లేవే . ఈ దేవుడు వేరుగా వున్నాడు. వయసై చాదస్తం అంటింది.
ప్రశాంతం గా ఉండు నన్ను ఉంచు అనీ దేవుడు ఇప్పుడు కష్టపడితే గాని కోర్కెలు తీర్చనంటుంటే , మా అమ్మకు నేను చెప్పేది ఒక్కటే . అమ్మ ఈ దేవుడు నా అమాయకపు దేవుడు కాడే. నా సుఖం కోసం కోరుకుని ఈ దేవుళ్ళతో నువ్వు కష్టపడకు. ఈ భక్తీ విధానంతో నీ కోసం మాత్రమె కూరుకో. ఈ దేవుడి లబ్దిదారుల లిస్టులో నన్ను చేర్చకు నా అమాయకపు దేవుడు నన్ను కాపాడుకొస్తున్నాడన్న తృప్తి నాకు ఉందనీ.
- గొల్లపూడి మల్లిక

దేశీయ ఆవుల ప్రాముఖ్యత


దేశీయ ఆవులు విదేశి ఆవులు వ్యత్యసములు

  • భారతీయ జాతి ఆవుల(గిర్, కంక్రేజ్ , రథ్, ఒంగోలు, తర్పర్కర్ మొదలగోన వాటి) పాల ఉత్పత్తి , విదేశీయ ఆవుల(జెర్సీ, హోల్స్టిన్ మొదలగోనవి) పాల ఉత్పత్తి కన్నా మెరుగు గా వుంటుంది.
  • దేశీయ ఆవు సంతతులు ఉష్ణ ప్రాంతానికి అలవాటు పడి  ఉన్నవి , వీటికి రోగ నిరోధక శక్తి ఎక్కువగా వుంటుంది , అందువలన వీటి పోషణ వ్యయము తక్కువ. ఐరోపా ఆవులకు ఈ వాతావరణానికి మరిన్ని జాగ్రతలు అవసరము . అందువలన  పోషణా వ్యయము విదేశి ఆవులతో ఎక్కువగా వుంటుంది . మన భారతీయ వాతావరణానికి అవి అనువైనవి  కాదు.
  • దేశీయ ఆవులు వేసవి కాలంలో అందుబాటులో వుండే ఎండుగడ్డి తినగలవు. ఎండా కాలం లో వీటికి ప్రత్యెక ఆహరం అవసరం లేదు. విదేశి(ఐరోపా) ఆవులు  ఎండా కాలంలో  విత్తనాలు(grains)  మాత్రమె తింటాయి. విదేశి ఆవులలో  పీచు పదార్ధాన్నిజీర్ణం చేసుకునే  శక్తి తక్కువ. ఇందువలన విదేశి ఆవుల ఆహారపు ఖర్చు వేసవిలో అధికంగా వుంటుంది.
  • దేశీయ ఆవుల మెడ క్రింద వేళ్ళాడే గంగడోలు(Dewlap) వాటిని ఉష్ణ  ప్రాంతాల వేడి నుండి బయటపడేందుకు సహాయం చేస్తుంది.
  • దేశీయ ఆవుల కాళ్ళు , కాళ్ళ ఎముకలు ధ్రుడంగా విదేశీ ఆవుల కన్నా మెరుగుగా వుంటాయి. ఇవి ఆవులయితే 10km ఎద్దులైతే 25Km సులువుగా ప్రయాణించ గలవు. అందువలన వీటిని సేద్యానికి ఉపయోగించుకునేందుకు వీలు వుంటుంది .దేశీయ అవులలో  మాత్రమె కనపడే మూపురం (Hump) వాటికి బరువులు మొయ్యటంలో  సహాయ పడుతుంది.
  • దేశీయ ఆవులు స్వతహాగా అతినీలలూహిత కిరణాలను(UV Rays)  తట్టుకోగలవు . విదేశి ఆవులు ఈ కిరణాలను తట్టుకోలేవు. అందువలన దేశీయ ఆవు పాలు విదేశి ఆవు పాల కన్నా పౌష్టికమైనవి.
  • దేశీయ ఆవుల పేడ(Cow Dung) భూమి ఉపరితలం పైన వుండే సూక్ష్మ జీవులకు మేలైనదై, భూ సారాన్ని పెంచే విధము గా వుంటుంది.
  • (erythrocytes) హీమోగ్లోబిన్ ను ప్రసారం చేసే  నాళాలు దేశీయ గోవులలో  ఎక్కువ గా వుంటాయి . 
  • దేశీయ ఆవులలో పునరుత్పత్తి ప్రక్రియ విదేశి ఆవుల కన్నా వృద్ధి చెందినది. ఏ మందుల సహాయం లేకనే అవి మంచి ఆరోగ్యమైన సంతతిని అందచేయ్యగలవు.
  • (leucocytes) దేశీయ ఆవుల తెల్ల రక్త కణాలలో (WBC) విరివిగా  లభిస్తాయి . అందువలన వాటి రోగనిరోధక శక్తి విదేశి ఆవుల కన్నా ఎక్కువగా ఉండి, ఆరోగ్యం గా వుంటాయి.
  • నెమరువేత (Rumination ) పద్దతి దేశీయ ఆవులలో విదేసియ ఆవుల కన్నా వృద్ధి చెంది వున్నది కాబట్టి అవి పీచు పదార్ధాన్ని సులువుగా జీర్ణం చేసుకోగలవు.
  • దేశీయ ఆవులలో శరీర ఉష్ణం లో మార్పులు కాలం మార్పులతో పెద్దగా సంభంధం వుండదు(Hyperthermia) . అందువలన వేసవిలో వీటి పాల ఉత్పత్తి లో తేడాలు వుండవు.
  • రక్త నాళాలు దేశి ఆవులలో విదేశి ఆవుల కంటే చక్కగా పని చేస్తాయి. కాబట్టి వీటి , పునరుత్పత్తి, ఉచ్వాస , గుండె పనితీరు అన్ని  మెరుగు గా వుంటాయి . ఐరోపా ఆవులలో  నాది, గుండె పని తీరు వాతావరణంతో ముడి  పడి వుంటాయి.
  • శ్వేద గ్రంధులు(Sweat glands ) దేశీయ ఆవులలో బాగా వృద్ధి చెంది వున్నది. వీటికి బాగా చెమట పడుతుంది. చెమట వేసవిలో వీటి శరీరాన్ని చల్ల పరుస్తుంది. విదేశి ఆవులలో శ్వేద గ్రంధులు నామ మాత్రమె.
  • పరాన్న జీవుల(parasites ) బెడద దేశి ఆవులలో విదేసిఆవులతో పోలిస్తే అతి తక్కువగా వుంటుంది.
  • దేశీయ ఆవుల పాలలో వుండే క్రొవ్వు పదార్ధం విదేశి ఆవుల క్రోవ్వులా కాక జీర్ణానికి సులువుగా వుంటుంది . దేశి ఆవుపాలు వెన్న నెయ్యి, పనీర్ వంటి వాటికి శ్రేష్టమైన ఎంపిక.
  • శరీర వర్ణక పరిణామం(Skin Pigmentation melanin) దేశీయ ఆవులలో ఎక్కువగా  వుంటుంది. దీనివలన దేసిఆవులు గాయాలను , మరియు క్రిఉల దాడిని  తట్టుకోగలవు . దేశీయ ఆవులలో గాయాలు మానటం వారం లోపే . విదేసియ ఆవులూ గాయాలు మానటం నాలుగు వారల పై మాటే. 
  • దేశి ఆవుల పాలు A2 కోవకు చెందినవి , విదేశి ఆవు పాలు A1 కోవకు చెందినవి A2 పాలు A1 పాల కన్నా ఎన్నో రెట్లు మెరుగైనది, A2 పాలలో BCM 7 వుండదు. అందువలన గుండెకు సంభందించిన A2 పాలు సేవించే వారికి వ్యాధులు తక్కువ. జీవన పరిమాణం (Life expectancy )ఎక్కువ.
  • దేశి ఆవు పాలు పురిటి పిల్లలకు కూడా పట్టవచ్చు . విదేశి ఆవు పాలు పురిటి పిల్లలు జీర్ణించుకోలేరు. 
  • దేశీయ ఆవు పాల వల్ల లభించే నెయ్యి ఒక  తులాన్ని  (11.66gms ) మండిస్తే 1 టన్ను ఆక్సిజెన్  విడుదల అవుతుంది.